Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చీర కారణంగా పెళ్లి పందిట్లో గొడవ.. పెళ్లి రద్దు!

  • ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమైన జంట
  • వధువు చీర నాణ్యత లేదన్న వరుడి తల్లిదండ్రులు
  • రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. పోలీసులకు ఫిర్యాదు
కేవలం చీర బాగాలేదన్నా కారణంగా ఓ పెళ్లి రద్దయిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. తమకు కాబోయే కోడలు చీర నాణ్యత బాగాలేదని ఆరోపిస్తూ పెళ్లిని రద్దు చేసుకున్నారు వరుడి తల్లిదండ్రులు. పూర్తి వివరాలను పరిశీలిస్తే... కర్ణాటకలోని హసన్ జిల్లాలోని ఒకే గ్రామానికి చెందిన వధూవరులకు వివాహం ఖాయమైంది.

పెళ్లి కొడుకు రఘు కుమార్, పెళ్లి కుమార్తె సంగీత  ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి తల్లిదండ్రులు కూడా వీరి ప్రేమకు అంగీకారం తెలపడంతో వివాహ ముహుర్తం నిశ్చయించారు. పెళ్లికి ముందురోజు ఈ చీర గొడవ తలెత్తింది. పెళ్లి కుమార్తె చీర నాణ్యతను పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు ఆక్షేపించారు. అనంతరం వరుడు, వధువు కుటుంబాల మధ్య వాగ్వాదం ఏర్పడి అది ఘర్షణకు దారితీసింది.

దీనితో వరుడి కుటుంబం వారు పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీంతో వధువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, వరుడు రఘు కుమార్ పరారైనట్లు పోలీసులు తెలిపారు.
Saree
Quality
Marriage
Cancelled
Karnatka

More Telugu News